Harish Rao | మంత్రి కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కౌంటర్ ఇచ్చారు. ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్‌రావు అమెరికాలో ఉన్నాడని.. ఆయన్ను కలిసేందుకు హరీశ్‌రావు వెళ్లారని మంత్రి కోమటిరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తన కుటుంబ సభ్యులతో కలిసే విదేశాలకు వెళ్లానని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లాను.. ఏ హోటల్లో ఉన్నాననే వివరాలు కూడా ఇస్తానని చెప్పారు.
తాను అమెరికాలో ప్రభాకర్‌రావును కలిసినట్టుగా రుజువు చేస్తే అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాస్తానని హరీశ్‌రావు సవాలు విసిరారు. కోమటిరెడ్డి తన దగ్గర ఉన్న ఆధారాలతో చర్చకు రావాలన్నారు. లేకపోతే అమరవీరుల స్థూపం వద్ద ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు. డేట్, టైమ్ కోమటిరెడ్డి చెప్పాలని.. నేను రెడీగా ఉన్నా.. పాస్పోర్టుతో సహా చర్చకు వస్తానని స్పష్టం చేశారు.