హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్‌ను సీఎం రేవంత్ మెప్పుకోసం ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ దూషిస్తే సహించేది లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత గోసుల శ్రీనివాస్‌యాదవ్ హెచ్చరించారు. దయాకర్ చేసిన వ్యాఖ్యలపై గోసుల శుక్రవారం ఘాటుగా స్పందించారు. 14ఏండ్లు పోరాడి రాష్ర్టాన్ని సాధించి, పదేండ్ల పాలనలో అన్నింటా అగ్రగామిగా నిలిపిన కేసీఆర్‌ను విమర్శించే అర్హత అద్దంకికి లేదని మండిపడ్డారు.
రేవంత్‌రెడ్డి రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో గెలిచేది బీఆర్ఎస్సేనని గుర్తుంచు కోవాలని సూచించారు. కేసీఆర్‌పై మరోసారి నోరుజారితే ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు.