సనత్‌నగర్ టిమ్స్ ఆస్పత్రి సందర్శనకు బయలుదేరిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ సర్కార్ పోలీసుల సాయంతో దౌర్జన్యకాండకు దిగింది. ఆస్పత్రి నిర్వహణలోని డొల్లతనం, తమ క్రెడిట్ చోరీ వ్యవహారం ఎక్కడ బయటపడుతుందో అనే భయంతో రేవంత్ సర్కార్.. మాజీ మంత్రులు, హరీశ్‌రావు, తలసాని, సబితారెడ్డి తదితర ముఖ్య నేతలను ముందస్తుగా హౌస్ అరెస్ట్ట్ చేయించింది. ఈ క్రమంలో పోలీసులు, హరీశ్‌రావుకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ హయాంలోనే టిమ్స్‌కు సంబంధించి 80శాతం పనులు పూర్తిచేశామని.. ఇటీవల రేవంత్ రెడ్డి కేవలం రిబ్బన్ కటింగ్ చేసి ఆస్పత్రిని తామే నిర్మించామంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. అక్రమ నిర్భందాలతో బీఆర్ఎస్ గొంతునొక్కలేరని.. ప్రజా సమస్యలపై నిరతరం పోరాడుతూనే ఉంటామని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ)
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్వహణలోని డొల్లతనం ఎకడ బయటపడిపోతుందోనన్న భయంతో రేవంత్ రెడ్డి ప్రభు త్వం అప్రజాస్వామిక చర్యలకు దిగింది. సనత్‌నగర్ టిమ్స్ దవాఖానా సందర్శనకు వెళ్లేందుకు సిద్ధ్దమైన మాజీ మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ముఖ్య నేతలను పోలీసులు గృహనిర్భంధం చేశారు. బుధవారం ఉదయం నుంచే బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్ రావు (కోకాపేట్ నివాసం), శ్రీనగర్ కాలనీలోని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని, జూబ్లీహిల్స్‌లో మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, కంటోన్మెంట్లో మన్నె క్రిశాంక్, ఇతర ముఖ్య నేతల ఇళ్ల వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నా రు. నాయకులు బయటకు రాకుండా ఇళ్ల పరిసరాలను దిగ్బంధించి, హౌస్ అరెస్టు చేశారు. ఈ క్రమంలో హరీశ్ రావు నివాసం నుంచి వాహనం బయటకు తీసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. హరీశ్ రావు మాట్లాడుతూ.. “కేసీఆర్ హయాంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా సనత్‌నగర్ టిమ్స్ నిర్మాణ పనులు అత్యధిక శాతం పూర్తయ్యాయని, కేవలం రిబ్బన్ కట్ చేసి ప్రచార ఆర్భాటం చేసుకున్న రేవంత్ రెడ్డికి అకడ వసతుల కల్పన పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. ఆసుపత్రుల్లోని అసలు నిజాలు, మౌలిక వసతుల లేమి, రేవంత్ సరార్ వైఫల్యాలు ప్రజల ముందుకు వస్తాయనే భయంతోనే ప్రభుత్వం పోలీసుల వెనుక దాకుంటోంది. ప్రతిపక్ష నేతలు ఆసుపత్రులను పరిశీలిస్తే ప్రభుత్వానికి వచ్చిన అభ్యంతరమేంటి?ప్రశ్నించే గొంతులను నొకేయడమే కాంగ్రెస్ మార్ ప్రజాపాలనా” అని హరీష్‌రావు మండిపడ్డారు.
వెంగళరావునగర్, ఆగస్టు 19: సనత్‌నగర్ టిమ్స్‌ను సందర్శించేందుకు మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని, బీఆర్ఎస్ నేతలు వస్తారన్న సమాచారంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దవాఖాన ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి, అనుమతి లేనిదే ఎవరినీ లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దవాఖానకి వచ్చే రోగులను సైతం విచారించిన అనంతరం లోనికి పంపించారు. మీడియా ప్రతినిధులను కూడా దవాఖానలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. సాయంత్రం వరకు టిమ్స్ వద్ద పోలీసు బందోబస్తు కొనసాగింది. ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు, బోరబండ ఇన్స్పెక్టర్ రవికుమార్ బందోబస్తును పర్యవేక్షించారు.

ఆరంభ శూరత్వంగా మారింది కాంగ్రెస్ సర్కార్ తీరు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించిన టిమ్స్ దవాఖానలోని ఇన్‌పేషెంట్ విభాగాన్ని ఈనెల 20వ తేదీ వరకు మూసేస్తున్నామని టిమ్స్ డైరెక్టర్ పేరిట ఓ నోటీస్‌ను ఆస్పత్రి మెయిన్ గేటుకు అంటించారు. పరిశుభ్రత పనులు జరుగుతున్నందున రోగులను చేర్చుకోలేమని..అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ నోటీసులో పేర్కొన్నారు. వ్యాధి నయం చేసుకుందామని గంపెడాశతో సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న రోగులు.. నోటీసు బోర్డు చూసి చేసేదిలేక నిస్సహాయంగా వెనుదిరిగి వెళ్లిపోతున్నారు.

ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు నిర్భంధాలు, హౌస్ అరెస్ట్‌లకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ ధ్వజమెత్తారు. హాస్పిటల్ సందర్శనకు వెళ్తామంటే ఈ ప్రభుత్వానికి భయమెందుకు అని, అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఒకవైపు ప్రజా ప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటున్న కాంగ్రెస్.. మరోవైపు అక్రమ నిర్భంధాలు, తప్పుడు కేసులు నమోదు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని మండిపడ్డారు. అక్రమ నిర్భంధాలతో ప్రతిపక్షాల గొంతునొక్కాలని చూస్తున్న సర్కార్‌కు త్వరలోనే తగిన గుణపాఠం చెబుతామని తలసాని హెచ్చరించారు.