ప్రభాస్ కథానాయకుడిగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్’ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతున్నది. తాజాగా ఈ వార్తలపై మేకర్స్ స్పష్టతనిచ్చారు. ముందస్తుగా ప్రకటించిన విధంగానే వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా చిత్రాన్ని విడుదల చేస్తామని తెలిపారు. “స్పిరిట్’ రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు.
షూటింగ్ కూడా ప్రణాళిక ప్రకారం జరుగుతున్నది. భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని మేకర్స్ బుధవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.ఆయన తొలిసారి పోలీస్ క్యారెక్టర్లో నటిస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తినెలకొంది. ఆయన మేకోవర్ అందరిని సర్ప్రైజ్ చేస్తుందని చెబుతున్నారు. త్రిప్తి దిమ్రీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని టీ సీరిస్, భద్రకాళి ఫిల్మ్స్ భారీ వ్యయంతో తెరకెక్కిస్తున్నాయి.