హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తన అక్రమాలను బయటపెడుతున్న బీఆర్ఎస్ నేతలు, నమస్తే తెలంగాణపై మంత్రి పొంగులేటి ఫ్రస్ట్రేషన్లో ఏదో మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. నమస్తే తెలంగాణ, కేటీఆర్, హరీశ్‌రావు అంటే మంత్రికెందుకు భయమని ప్రశ్నించారు. నిజాలను నిర్భయంగా రాస్తున్న ‘నమస్తే తెలంగాణ’ మంత్రికి గుమస్తా పేపర్లా కనిపిస్తున్నదా? అని నిలదీశారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ అక్రమాలను బయటపెట్టినందుకు మంత్రి చేస్తున్న పిట్ట బెదిరింపులకు భయపడే వాళ్లు ఎవరూ లేరని స్పష్టంచేశారు. ‘నమస్తే తెలంగాణ’ పత్రికపై ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.