Errolla Srinivas | హైదరాబాద్ : తెలంగాణలో పాలనను గాలికి వదిలేసి ఇతర రాష్ట్రాల్లో గాలి మోటార్లలో చక్కర్లు కొడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. ముఖ్యంగా మా నాయకుడు కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్‌పై ముఖ్యమంత్రి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి బజారు భాషను తీవ్రంగా ఖండిస్తున్నామని శ్రీనివాస్ స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. ప్రజలకు ఇచ్చిన 420 హామీలు అమలు చేయండి. రేవంత్ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజల దురదృష్టకరం. రైతు రుణమాఫీ చేయండి. అవ్వ తాతలకు రూ. 4000 పెన్షన్ ఇస్తామన్నారు.. ఇప్పటివరకు అతిలేదు గతిలేదు. ఇంకా రెండు నెలల పెన్షన్ కూడా ఎగబెట్టాడు ఈ ఎగవేతల రెడ్డి. పెళ్లికి అడబిడ్డలకు ఇస్తామన్న తులం బంగారం ఎటు పోయింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలకు కప్పం కట్టేందుకు ఇవాళ మూసీని ముందట వేసుకున్నారని ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
తెలంగాణ స్వరాష్ట్రం సాధకుడు.. పదేండ్లు సీఎంగా సేవలందించిన కేసీఆర్‌ను ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. మా పార్టీ నాయకులపై పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరిస్తున్నాను. అది ఫెయిల్ కావడంతో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కేసీఆర్ దయ వల్ల రేవంత్ ముఖ్యమంత్రి అయ్యాడు.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాడు. మా మీద దాడి చేస్తాం అంటే రాబోయే కాలంలో మాటకు మాట ఉంటుంది. కాంగ్రెస్ నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకోని మాట్లాడాలి లేదంటే చర్యకు ప్రతి చర్య ఉంటుంది. రానున్న రోజుల్లో కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందని ఎర్రోళ్ల శ్రీనివాస్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | నారాయణపేట – కొడంగల్ లిఫ్ట్ పనుల్లో భారీ అవినీతి.. మండిపడ్డ కేటీఆర్
Harish Rao | గారడి మాటలు చెప్పేందుకు గాలి మోటార్లలో సీఎం, మంత్రులు..! హరీశ్‌రావు తీవ్ర విమర్శ