సెక్రటేరియట్ ఎదుట నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మద్దతు పలికారు. జాబ్ క్యాలండర్ విడుదల చేయాలని, టీజీపీఎస్సీ నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు చలో సెక్రటేరియట్‌కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం భయపడి అన్ని జిల్లాల్లో నిరుద్యోగులను, బీఆర్ఎస్వి కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. భయం గల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టుగా ప్రభుత్వ వ్యవహారం ఉందని ఎద్దేవా చేశారు.
చలో సెక్రటేరియట్‌పై ఉన్న భయం నోటిఫికెషన్స్ ఇవ్వడం విషయంలో ఎందుకు లేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలిస్తామన్న హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. ఎన్నికల ముందు నిరుద్యోగ సమస్య పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారని.. కానీ, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేశారు తప్ప రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యను పరిష్కారం చేయలేదని అన్నారు. నోటిఫికేషన్స్ కోసం లక్షల మంది నిరుద్యోగులు కోటి ఆశలు పెట్టుకున్నారని.. వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారని తెలిపారు. వాళ్లకు మీ సమాధానం ఏంటని ప్రశ్నించారు.
దేశంలో అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లు జాబ్ క్యాలండర్ రిలీజ్ చేసినప్పుడు ఇప్పటివరకు టీజీపీఎస్సీ ఎందుకు క్యాలండర్ రిలీజ్ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర యువతను మోసం చేసినందుకు కాంగ్రెస్ నాయకులు ముక్కు నేలకు రాసి యువతకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అక్రమంగా అరెస్ట్ చేసినవారిని వెంటనే విడుదల చేయాలన్నారు. నిరుద్యోగ యువత మీద పెట్టిన అన్ని అక్రమ కేసులను తొలగించాలన్నారు.
జాబ్ క్యాలండర్ రిలీజ్ చెయ్యాలి, #TGPSC నోటిఫికేషన్స్ ఇవ్వాలంటూ నిరుద్యోగులు చలో సెక్రటేరియట్ కు పిలుపునివ్వడంతో ప్రభుత్వం బయపడి అన్ని జిల్లాల్లో నిరుద్యోగులను, @BRSparty బీఆర్ఎస్వి కార్యకర్తలను అక్రమంగా అరెస్ట్ చేయడం దుర్మార్గం.
భయం గల్ల కోడి బజార్ల గుడ్డు పెట్టినట్టుంది… pic.twitter.com/53jv6XzekU
— Rakesh Reddy Anugula (@RakeshReddyBRS) July 4, 2025