హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : జీవో 46ను రద్దు చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి కోరారు. సోమవారం సెక్రటేరియట్లో జీవో 46 బాధితులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్‌కు వినతిపత్రం సమర్పించారు. జీవో 46 రద్దు పై మంత్రి సానుకూలంగా స్పందించి, శాసనసభ సబ్ కమిటీలో చర్చిస్తామని హామీ ఇచ్చారని రాకేశ్‌రెడ్డి తెలిపారు.