హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : అశోక్‌నగర్ సాక్షిగా కాంగ్రెస్ సర్కార్ కుట్రబుద్ధి బయటపడిందని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. అశోక్‌నగర్‌లో నిరసన తెలుపుతున్న అభ్యర్థులకు మద్దతుగా నిలిచిన తమ పార్టీకి, బీజేపీకి వేర్వేరు న్యాయం ఉన్నదని చెప్పారు.
సంఘీభావం తెలిపేందుకు వెళ్లిన తమపై పోలీసులు దాడిచేసి, అరెస్టు చేశారని, బీజేపీ నేతలకు సహకరించారని తెలిపారు. సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో తనతోపాటు ముఠా జైసింహా, గజ్జెల నగేశ్, బండ్లగూడ పోలీస్‌స్టేషన్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సహా మరికొందరిని నిర్బంధించారని వివరించారు. బీజేపీ నేతలు బండి సహా అనేక మందిని విడిచిపెట్టారని, ఇదే ఆ పార్టీలు ఒక్కటనేందుకు ఉదాహరణ అని స్పష్టంచేశారు.