హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): ఏసీబీ ముసుగులో రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు, ఈడీ ముసుగులో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కుమ్మక్కై నిత్యం ప్రజాసమస్యలపై ప్రశ్నిస్తున్న కేటీఆర్‌ను అణచివేసేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఎన్ని కుతంత్రాలకు దిగినా కేటీఆర్ మొన్న ఏసీబీ, నేడు ఈడీ విచారణకు హాజరయ్యారని చెప్పారు. దర్యాపు సంస్థల విచారణ తీరు చూస్తుంటే ఇది ముమ్మాటికీ తప్పుడు కేసు అనేది స్పష్టమవుతున్నదని గురువారం ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.