హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై కేం ద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు అసందర్భమని ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి చేతిలో బండి సంజయ్ తోలుబొమ్మలా మారిపోయారని పేర్కొన్నారు. కరీంనగర్ నుంచి ఎంపీగా గెలిచేందుకు సహకరించిన రేవంత్‌రెడ్డికి బండి సంజయ్ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ నాయకుడిగా కాకుండా కాంగ్రెస్ నేతల మాటలను బండి సంజయ్ పలుకుతున్నారని మం డిపడ్డారు. రాష్ట్రం కోసం కేసీఆర్ చేసిన త్యాగాలను ఎలాంటి రాజకీయాలు చెరిపేయలేవని హెచ్చరించారు.
దేశంలో క్రైస్తవులకు రక్షణ కరువు ; రాష్ట్ర ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్‌సాగర్
హైదరాబాద్, మార్చి 26 (నమస్తే తెలంగాణ): క్రైస్తవ మత పెద్దలు పా స్టర్ ప్రవీణ్ పగడాల, అడ్వకేట్ ఇజ్రాయెల్ హత్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తున్నట్టు తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ రాజీవ్‌సాగర్ మండిపడ్డారు. బుధవా రం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాస్టర్ మరణాన్ని ఏపీలోని కూటమి సర్కారు రోడ్డుప్రమాదంగా చిత్రీకరించే ప్రయ త్నం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తడి లేకుండా దర్యాప్తు చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, కిస్ట్రియన్ జేఏసీ చైర్మన్ సాల్మోన్రాజు, రిటైర్డ్ జడ్జి రాజ్‌కుమార్ పాల్గొన్నారు.