హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి రూ.100 కోట్ల అదానీ విరాళాన్ని తిరస్కరించడం వెనుక అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ చెప్పారు. రూ.1200 కోట్లకుపైగా ఒప్పందాలను అనుమతించిన రేవంత్‌రెడ్డి, విరాళాన్ని వెనక్కి ఇచ్చేయడంలోని అంతర్యమేంటని సోమవారం ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. క్రోనీ క్యాపిటలిజానికి వ్యతిరేకంగా రాహుల్‌గాంధీ గళమెత్తుతుంటే.. రేవంత్‌రెడ్డి మాత్రం వారికి వంతపాడుతున్నారని ఆరోపించారు. ‘ఆయన రాహుల్ నాయకత్వంలో పనిచేస్తున్నారా? లేదంటే అదానీ ప్రయోజనాలను కాపాడుతున్నారా?’ అని శ్రవణ్ నిలదీశారు. రేవంత్‌రెడ్డి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ రాహుల్, కాంగ్రెస్ నిబద్ధతను ప్రశ్నార్థకం చేస్తున్నారని మండిపడ్డారు. చిన్న దేశమైనా కెన్యా అదానీ కంపెనీలతో ఒప్పందాలను రద్దుచేసుకున్నప్పుడు, రేవంత్ ఎందుకు చేయలేరని సూటీగా ప్రశ్నించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే అదానీ ఇచ్చిన విరాళాన్ని తిరస్కరించారని మండిపడ్డారు.