రైతులకు రేవంత్ క్షమాపణ చెప్పాలి.. బీఆర్ఎస్ నేత దాసోజు డిమాండ్
సాగుకు 3 గంటల కరెంట్ చాలని అవమానపర్చిన రేవంత్‌రెడ్డి బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రైతులపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్ పాలి త కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో ముందుగా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి, తెలంగాణలో మాట్లాడాలని హితవు పలికారు.
హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): సాగుకు 3 గంటల కరెంట్ చాలని అవమానపర్చిన రేవంత్‌రెడ్డి బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రైతులపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్ పాలి త కర్ణాటక, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ర్టాల్లో ముందుగా 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చి, తెలంగాణలో మాట్లాడాలని హితవు పలికారు. గురువారం తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి, నేతలు రూప్సింగ్, కట్టెల శ్రీనివాసయాదవ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి మూ ర్ఖుడని, చిల్లర మాటలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. రేవంత్ కాంగ్రెస్‌కే కాదు.. తెలంగాణకు, సభ్య సమాజానికి పట్టిన శనిగా అభివర్ణించారు. బుద్ధి, జ్ఞానం, సభ్యత, సం స్కారం లేకుండా మాట్లాడుతున్న సన్నాసి అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రైతులు సంతోషంగా ఉంటే కండ్లలో నిప్పులు పోసుకునే వెధవ నాయకుడు ఎవరైనా దేశంలో ఉంటే అది రేవంతేనని పేర్కొన్నారు. రైతుల జోలికి వస్తే సహించబోమని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా రేవంత్ దిష్టిబొమ్మలు దహనం చేస్తున్నా బుద్ధి రావడం లేదని, ఇంకా కేసీఆర్‌పై విమర్శలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తప్పును కప్పి పుచ్చుకోవడమే కాకుండా కరెంట్ కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, కమీషన్ల కోసమే చేశారని ఆరోపించడం దుర్మార్గమని అన్నారు. దండుగ అన్న వ్యవసాయాన్ని పండుగ చేసిన సీఎం కేసీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించబోమని స్పష్టం చేశారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఇవ్వడం లేదని అసత్య ఆరోపణలు చేస్తున్న రేవంత్‌రెడ్డి దమ్ముంటే ట్రాన్స్‌ఫార్మర్‌లో వేలో, చెయ్యో పెట్టి చూడాలని, కరెంట్ ఉన్నదా? లేదా అన్న విషయం తెలుస్తుందని ఎద్దేవా చేశారు. కరెంట్ ఉంటే తక్షణమే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటయ్యాయనే విషయాన్ని రేవంత్‌రెడ్డి మరోసారి నిరూపించారని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

