జగిత్యాల : తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్శితులై కాంగ్రెస్, బీజేపీ తదితర పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరుతున్నారు. జగిత్యాల రూరల్ మండలం తక్కలపెల్లి గ్రామ మాజీ సర్పంచ్, కాంగ్రెస్ నాయకులు ఏదుల్ల రాధా సతీశ్,బీజేపీ నాయకులు మాజీ వార్డ్ మెంబర్ నరేశ్, గంగాధర్, అనుచరులు బుధవారం బీఆర్ఎస్ పార్టీ (BRS ) లో చేరారు. ఈ సందర్భంగా వీరికి జగిత్యాల ఎమ్మెల్యే (MLA) డాక్టర్ సంజయ్ కుమార్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకు(Welfare programmes) ఆకర్శితులై ఇతర పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్ఎస్ వారికి సముచిత గౌరవం ఇస్తుందని వెల్లడించారు. ఏ రాజకీయ పార్టీలు చేపట్టని విధంగా పార్టీ కార్యకర్తలకు బీమా సౌకర్యం అందిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు.
అనంతరం మండలంలోని కల్లేడ, సోమనపల్లి గ్రామాలలో ఎమ్మెల్యే పర్యటించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి భూమి పూజ చేశారు. తొమ్మిది మంది ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి పథకం ద్వారా మంజూరైన చెక్కులను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజేంద్రప్రసాద్, ఏఎంసీ చైర్మన్ నక్కల రాధా రవీందర్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర శేఖర్ గౌడ్, పీఏసీ చైర్మన్ సందీప్ రావు, సర్పంచ్ జయపాల్ రెడ్డి, మాజీ మార్కెట్ చైర్మన్ దశరత్ రెడ్డి ,సీనియర్ నాయకులు రమణారెడ్డి, ఉపసర్పంచ్ విక్రం, నాయకులు రాజేశ్వర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.