సిద్దిపేట, డిసెంబర్ 14 : మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి మోత్కు సుమలతాశంకర్ ఘన విజయం సాధించారు. 2,045 ఓట్లు పోలు కాగా, సుమలతాశంకర్ 850 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థిపై గెలుపొందారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన గెలుపునకు కృషి చేసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, చింతమడక గ్రామస్తులకు ధన్యవాదాలు తెలిపారు. తనను రాజకీయంగా ప్రోత్సహించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావుకు రుణపడి ఉంటానని పేర్కొన్నారు.
చిట్యాల, డిసెంబర్ 14 : నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో బ్యాలెట్ పత్రాలు మురికి కాలువలో లభించడంపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. బాధ్యులైన 12 మంది అధికారులను, సిబ్బందిని సస్పెండ్ చేసింది. చిన్నకాపర్తి సర్పంచ్ స్థానానికి ఈ నెల 11న ఎన్నికలు నిర్వహించగా, 12న బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి రు ద్రారపు భిక్షపతికి పోలైన బ్యాలెట్ పత్రా లు మురుగుకాలువలో దొరికాయి. దీని పై మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి, భూపాల్‌రెడ్డి ఫిర్యాదు చేశా రు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో చి ట్యాల ఎంపీడీవో జయలక్ష్మి, స్టేజ్ 2 అధికారి విజయ్‌కుమార్‌తో సహా 12 మం దిని సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉత్తర్వులు జారీ చేశారు.