హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలిచేది బీఆర్ఎస్సేనని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఎన్నారై బీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీశ్‌కుమార్ ధీమా వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ 115 మంది ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. సీఎం కేసీఆర్ వెంటే తాము ఉంటామని, బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేస్తామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాయని, వాటి ప్రచారాన్ని నమ్మొద్దని సతీశ్‌కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎప్పుడు ప్రజల మధ్య నిలబడే నాయకుడు కేసీఆర్ అని, బీఆర్ఎస్కు మళ్లీ ప్రజలు బ్రహ్మరథం పట్టాలని పిలుపునిచ్చారు.