హైదరాబాద్, ఏప్రిల్ 24 (నమస్తే తె లంగాణ): టెర్రరిస్టులపై పెట్టాల్సిన ‘ఉపా’ చట్టాన్ని జర్నలిస్టులపై ప్రయోగిస్తూ రే వంత్ సర్కార్ దుర్వినియోగం చేస్తున్నద ని బీఆర్ఎస్ ప్రధానకార్యదర్శి ఆర్ఎస్ ప్ర వీణ్‌కుమార్ ఆరోపించారు. రహస్య కార్యకలపాలు నిర్వహించే కౌంటర్ ఇంటెలిజెన్స్‌తోపాటు పోలీసులు, ప్రభుత్వ సంస్థలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తున్నదని నిప్పులుచెరిగారు. ప్రజాపాలన ముసుగులో ప్రతీకారపాలన నడుపుతున్నదని మండిపడ్డారు. ప్రభుత్వ అక్రమాలను ఆధారాలతో బట్టబయలు చేస్తు న్న తెలుగుస్ర్కైబ్పై ఉపా చట్టం కింద కేసుపెట్టి గొంతునొక్కేందుకు యత్నిస్తున్నదని విమర్శించారు. జర్నలిస్టులోకం సంఘటితమై సర్కార్ దురాగతాలను ఎదుర్కోవాలని, లేదంటే నేడు తెలుగుస్ర్కైబ్కు ఎదురైన పరిస్థితే భవిష్యత్తులో ప్రశ్నించేవారందరికీ ఎదురయ్యే ప్రమాదమున్నదని హె చ్చరించారు. తెలంగాణభవన్‌లో శుక్రవా రం బీఆర్ఎస్ నేతలు పాటిమీది జగన్మోహన్రావు, కల్వకుర్తి శ్రీనివాస్‌యాదవ్, సాయితేజరావు, వెంకటేశ్‌గౌడ్‌తో కలిసి ప్రవీణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడా రు. సర్కార్ కుట్రలు భరించలేకే శంకర్‌గౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు.అంతిమయాత్రకు వెళ్లేందుకు యత్నించిన బీఆర్ఎస్ నేతల ను అరెస్ చేయడాన్ని ఖండించారు.
తెలుగుస్ర్కైబ్పై 70 అక్రమ కేసులు
తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న పాపులర్ సోషల్ మీడియా హ్యాండిల్ తెలుగుస్ర్కైబ్పై సర్కార్ కక్ష సాధిస్తున్నదని ప్రవీణ్‌కుమార్ ఆరోపించా రు. సదరు మీడియా హ్యాండిల్ ఇతరుల పరువుకు నష్టం కలిగిస్తున్నదని, కుల, మ త కల్లోలాలు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నదని, అశాంతిని సృష్టిస్తూ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నదని టీసీఐ సెల్ ఎక్స్‌కు ఫిర్యాదు చేశారని గు ర్తుచేశారు. అక్రమాలను అడ్డుకున్న మీడియాపై బీఎన్ఎస్ 94 యాక్ట్‌తోపాటు సవరించిన ఉపా కింద 70 అక్రమ కేసులు బుక్ చేశారని విమర్శించారు. గతంలో ముంబై దాడికి కారకుడైన కసబ్మీద ప్రయోగించిన చట్టాన్ని తెలుగుస్ర్కైబ్పై ప్ర యోగించి భయానక పరిస్థితులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. గతంలో ప్రభు త్వం తెలంగాణ జర్నలిస్టులు, సోషల్ మీ డియా యాక్టివిస్ట్లపై 250 అక్రమ కేసు లు బనాయించిందని చెప్పారు. అత్యంత రహస్యంగా ఉంచాల్సిన ప్రభుత్వ సంస్థలను బజారుకీడుస్తున్నారని ఆరోపించారు. గతంలో 99 శాతం పోలీసులకు సైతం తెలియని కౌంటర్ ఇంటెలిజెన్స్‌లో తలదూర్చుతున్నారని ధ్వజమెత్తారు. 89 కేసులు ఉన్న వ్యక్తిని సీఐలోకి ఏవిధంగా అనుమతిస్తున్నారో డీజీపీ, హోంసెక్రటరీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
జగ్గారెడ్డికి ఓ న్యాయం.. క్రిశాంక్‌కు మరో న్యాయమా?
మున్సిపల్ ఎన్నికల సందర్భంగా సంగారెడ్డిలో పోలీసులను బెదిరించిన మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, హరీశ్‌రావుపై పెట్రోల్ పోసి నిప్పంటిస్తానని భయభ్రాంతులకు గురిచేసిన మై నంపల్లి హన్మంతరావుపై ఇంతవరకు కేసు నమోదుచేయకపోవడం శోచనీయమని ఆర్ఎస్పీ అన్నారు. కానీ త న భార్యపై దుష్ప్రచారం చేసిన కాం గ్రెస్ నేతలను నిలువరించిన క్రి శాంక్పై కేసులు నమోదు చేసి అరెస్ట్ చే యడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంటే జగ్గారెడ్డి, మైనంపల్లికి ఓ న్యాయం? క్రిశాంక్‌కు మరో న్యాయమా? అని నిలదీశారు. ఇప్పటికైనా ప్రభుత్వం సోయితెచ్చుకొని సదరు నాయకులపై కేసులు నమో దు చేయాలని డిమాండ్ చేశారు.