Vinod Kumar | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి అన్నీ గోబెల్స్ ప్రచారాలు అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తప్పుడు ప్రచారాలు చేస్తూ ఊరుకోం అని రేవంత్నను వినోద్ కుమార్ హెచ్చరించారు. తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
సైనిక్ స్కూల్ కోసం కేసీఆర్ ఎంతో ప్రయత్నించారు. కేసీఆర్ రాసిన లేఖలన్నీ ఇప్పటికీ ఉన్నాయి. సైనిక్ స్కూల్ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని కేంద్రం షరతులు పెట్టింది. రేవంత్ రెడ్డి మాపై నిందలు వేయడం దుర్మార్గం. నిరుద్యోగులను రెచ్చగొట్టి ఓట్లు దండుకున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తే ఊరుకోం. సైనిక్ స్కూల్ కోసం కొట్లాడాం.. సాధించాం. డిఫెన్స్ భూముల కోసం కేటీఆర్ ఎంతో శ్రమించారు. మా కృషితో వచ్చిన భూములను మీ గొప్పలుగా చెప్పుకున్నారు. మేం చేసిన శ్రమంతా మినిట్స్ బుక్స్‌లో ఉంటుంది. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.