Patnam Narender Reddy | హైదరాబాద్ : కొడంగల్లో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. కొడంగల్ పట్టణంలో దర్గా, కబ్రస్తాన్ తొలగింపుపై బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు చేపట్టిన ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం ఆయనను బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా పట్నం నరేందర్ రెడ్డి పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరుపై బీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు.
కొడంగల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్
కోడంగల్ పట్టణంలో దర్గా, కబ్రస్తాన్ తొలగింపుపై బీఆర్ఎస్ మైనారిటీ నాయకులు చేపట్టిన ర్యాలీలో పాల్గొనడానికి బయలుదేరిన పట్నం నరేందర్ రెడ్డిని అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు pic.twitter.com/dEJmiknrdl
— Telugu Scribe (@TeluguScribe) September 25, 2025