Korukanti Chandar | పెద్దపల్లి : ఎన్టీపీసీ స్టేజ్ -2 ప్లాంట్ విస్తరణలో ప్రభావిత ప్రాంతాల ప్రజల సమస్యలు పరిష్కరించి, స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సమర్పించారు. కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించిన అనంతరం కోరుకంటి చందర్ మీడియాతో మాట్లాడారు.
ఎన్టీపీసీ గతంలో 10 వేల ఎకరాలు సేకరించింది.. మళ్ళీ 600 ఎకరాలు భూసేకరణ చేస్తున్నది. గత ప్రజాభిప్రాయ సేకరణకు ఇప్పుడు తేడా ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో పోలీస్ పహారా నడుమ నడుస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ అంటే ప్రజల నుండి అభిప్రాయాలు తీసుకోవాలి. ప్రభావిత ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలి అని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. బద్రిపల్లి, మల్యాలపల్లి, యాష్ ప్లాంట్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. పోలీస్ కమిషనరేట్ పక్కన ఖాళీ స్థలాన్ని తరలించాలి అని కోరుకంటి చందర్ కోరారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నారాయణదాసు మారుతి, నూతి తిరుపతి, ఇరుగురాళ్ల శ్రావణ్, వడ్లకొండ మహేందర్ పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
Suryapeta | నానమ్మ కళ్లలో ఆనందం కోసమే నా భర్త హత్య.. భార్గవి సంచలన వ్యాఖ్యలు..!