Gongidi Sunitha | హైదరాబాద్ : తెలంగాణలో 420 హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీ చార్ సౌ బీస్ పార్టీగా మారిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్ర విమర్శలు చేశారు. దొంగ గాంధీలు తెలంగాణకు వచ్చి తప్పుడు డిక్లరేషన్లు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మీడియాతో మాట్లాడారు.
ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి 420 రోజులు నిండాయి. హామీలు అమలు చేయలేకపోతున్న కాంగ్రెస్ పార్టీకి సద్బుద్ధిని ప్రసాదించాలని మహాత్మాగాంధీ విగ్రహాలకు వినతి పత్రాలు సమర్పించాం. గాంధీ విలువలు కేసీఆర్ పాటిస్తే కాంగ్రెస్ వాటిని తుంగలో తొక్కింది. రైతు భరోసా, రుణమాఫీ, రేషన్ కార్డుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేసీఆర్‌పై అబద్దాలు ప్రచారం చేస్తూ కాంగ్రెస్ నేతలు గోబెల్స్‌ను మించిపోయారు అని గొంగిడి సునీత మండిపడ్డారు.
ఏడాదిలోపే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అశోక్ నగర్లో నిరుద్యోగులకు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. కనీసం అందులో పావలా వంతు కూడా ఇప్పించలేక పోయారు. కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా ఉద్యోగాలు ఇచ్చినా కాంగ్రెస్ నేతలు ఉద్యోగాలు ఇవ్వలేదని ప్రచారం చేశారు. గురుకులాల్లో పిల్లలు వసతులు లేకుండా ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల గుండె కోతపై ప్రభుత్వం స్పందించడం లేదు. యూరియాకు కూడా రైతులు చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితి వచ్చింది. రేవంత్ రెడ్డికి మంచి బుద్దిని ప్రసాదించి హామీలు అమలు చేసేలా చూడాలని జాతి పితను వేడుకుంటున్నాం అని మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
BRS | కాంగ్రెస్ 420 హామీలపై బీఆర్ఎస్ ఆగ్రహం.. గాంధీ విగ్రహాలకు వినతిపత్రాలు అందజేత
Niranjan Reddy | తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నారు : నిరంజన్ రెడ్డి