Dasyam Vinay Bhasker | హైదరాబాద్ : ప్రజా సమస్యలపై పోరాడుతున్న మా పార్టీ కార్యానిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌పై సీఎం రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే కేసులతో వేధింపులకు గురి చేస్తున్నాడని ఆయన ధ్వజమెత్తారు.
కాంగ్రెస్‌ది ప్రజా పాలన కాదు ప్రతీకార పాలన అని నిప్పులు చెరిగారు. ఫార్ములా ఈ కేసు కాంగ్రెస్ ప్రభుత్వ కుంచితత్వానికి నిదర్శం. కాంగ్రెస్ పూటకో కేసు పేరు చెప్పి మా నాయకులను బద్నాం చేసే ప్రయత్నం చేస్తోంది. కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా ప్రజా పోరాటం ఆపం. ప్రజల తరపున ప్రశ్నించడం ఆపం అని వినయ్ భాస్కర్ తేల్చిచెప్పారు.
ఫార్ములా ఈ కేసు ప్రభుత్వ కక్షపూరిత దోరణికి ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. సుంకిశాల ప్రాజెక్టు రిటైనింగ్ వాల్ కూలిపోతే విచారణ లేదు, ఎస్ఎల్బీసీ కూలిపోయి కార్మికులు సమాధి అయితే వెలికితీత లేదు, విచారణ అంతకన్నా లేదు, ముఖ్యమంత్రిపై మంత్రి బిడ్డ విమర్శలు చేస్తే సమాధానం లేదు. మంత్రివర్గంలోని ఒక మంత్రి ఇంటిలో సీబీఐ రైడ్స్ జరిగితే దానిపై విచారణ ఉండదు… కానీ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పటంలో అగ్ర భాగాన నిలిపిన కేటీఆర్‌పై, నిర్వహించిన ఈ రేస్‌పై విచారణ పేరుతో వేధించడం కాక మారేది కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం కేటీఆర్‌పై చేస్తున్న కుట్రలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు.