Kollapur | కొల్లాపూర్, జనవరి 30: సురభి రాజుల సంస్థానంలో ప్రజలను ప్లేగు వ్యాధి నుండి కాపాడితే ఈదమ్మ తల్లికి గుడి నిర్మాణం చేపడతానని సురభి సంస్థానాధీశులు ముడుపు కట్టారు. దీంతో సంస్థానంలో ప్లేగు వ్యాధులు తగ్గడంతో సున్నపు గచ్చుతో అమ్మవారి విగ్రహం చేయించి ప్రతిష్టించారు. వందల సంవత్సరాల క్రితం ఈదమ్మ తల్లి కొల్లాపూర్ ప్రజలకే కాక సమీప గ్రామాల ప్రజలకు ఇలవేల్పుగా ఉన్నది. గత కొన్ని దశాబ్దాలుగా ఆలయం శిథిల వ్యవస్థకు చేరడంతో పాటు అమ్మవారి విగ్రహం కండనం జరిగింది. కండనం జరిగిన విగ్రహానికి పూజలు జరగడం ఆగమ శాస్త్రానికి విరుద్ధమని కొల్లాపూర్ ప్రజలు, రైతులు ఆలయ పునర్ నిర్మాణం చేపట్టడం కోసం ఎంతో ప్రయత్నించారు. ఎంతోమంది నాయకులు చుట్టు తిరిగిన ఆలయం పునర్నిర్మాణం కోసం ఎవరు ముందుకు రాలేదు.
మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి రావడంతో విగ్రహంతో పాటు నా సొంత నిధులతో ఆలయ పున:నిర్మాణం చేపడతానని ముందుకొచ్చి పనులు ప్రారంభించారు. మహాబలిపురంలో కృష్ణశిల రాయితో అమ్మవారి విగ్రహాన్ని తయారు చేయించారు. ఆలయ నిర్మాణ పనులు పూర్తి కావడంతో ఈ నెల 29న గణపతి పూజతో ఆలయ ప్రతిష్ట కార్యక్రమం ప్రారంభమైంది. రెండో రోజైన గురువారం నాడు వేలాది భక్త జన సందోహం మధ్యలో కొల్లాపూర్ పట్టణంలోని మాధవస్వామి ఆలయం నుంచి ఈదమ్మ తల్లి ఆలయం వరకు అమ్మవారి విగ్రహం ఊరేగింపు కన్నుల పండువగా కొనసాగింది. అమ్మవారి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘువర్ధన్ రెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. సందర్భంగా చిన్నారుల కోలాటంతో పాటు పోతురాజుల వేషాలు, డప్పు వాయిద్యాలు ప్రదర్శన అలరింపజేశాయి.
ఇవి కూడా చదవండి..
KTR | నిధులడిగితే గెంటేస్తారా?.. బీఆర్ఎస్ కార్పొరేటర్లను అరెస్టు చేయడం దుర్మార్గం : కేటీఆర్
Niranjan Reddy | తెలంగాణ ప్రజలు కేసీఆర్ను ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నారు : నిరంజన్ రెడ్డి