మహారాష్ట్రలో గ్రామగ్రామాన తెలంగాణ మాడల్ గురించి ప్రచారం చేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ‘కమిటీలు వేసుకొనే సమయంలో గ్రామాలకు వెళ్లినపుడు పార్టీ నాయకులు స్థానికులతో కలివిడిగా ఉండాలి. దళితుల వాడలకు, మైనార్టీల వద్దకు వెళ్లినపుడు కలిసి భోజనం చేయాలి. తెలంగాణ మాడల్ గురించి వివరంగా చెప్పాలి. మహారాష్ట్రకు కూడా తెలంగాణ వంటి పథకాలు కావాలంటే బీఆర్ఎస్కు ఓటేయడం ఎంత ముఖ్యమో వివరించాలి. 30 రోజులు శ్రమపడితే అద్భుతాలు సాధించవచ్చు.
శిక్షణా శిబిరాల తర్వాత ప్రతి ఒకరు మహారాష్ట్రలోని 45 వేల గ్రామాలకు వెళ్లాలి. పురపాలక, నగరపాలక సంస్థల్లో కలిపి 5 వేల వార్డులున్నాయి. అన్నింట్లోనూ పార్టీ కమిటీలను ఏర్పాటు చేద్దాం. 50 వేల యూనిట్లలో పార్టీ కమిటీల ఏర్పాటును మొదలు పెట్టాలి. రేపటి రోజు మహారాష్ట్రలోని సుశిక్షితులైన బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్‌గఢ్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
– సీఎం కేసీఆర్
(నాందేడ్ నుంచి నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి): తెలంగాణ సాధించినట్టుగా మహారాష్ట్రలో కూడా మార్పు తేవటం బీఆర్ఎస్ కుటుంబంగా మనందరి బాధ్యత అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కే చంద్రశేఖర్‌రావు అన్నారు. తెలంగాణ, మహారాష్ట్రది బేటీ, రోటీ బంధమని చెప్పారు. తెలంగాణతో మహారాష్ట్రకు వెయ్యి కిలోమీటర్ల సరిహద్దు ఉన్నదని, చుట్టరికాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు. శుక్రవారం నాందేడ్‌లోని అనంతలాన్స్లో బీఆర్ఎస్ మహారాష్ట్ర విభాగం శిక్షణా శిబిరాన్ని కేసీఆర్ ప్రారంభించి మాట్లాడారు. ‘దేశానికి నాయకత్వం వహించే అవకాశం మీకు దకనున్నది. ఏ లక్ష్యం కోసమైతే మనం సం కల్పం తీసుకొన్నామో.. ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మీరంతా సుశిక్షితులు కావాలి. అందుకోసమే శిక్షణా శిబిరాలు ఏర్పాటుచేశాం. మహారాష్ట్రకు చెందిన మీరంతా ఒక మీ రాష్ట్రం కోసమే కాదు.. దేశం కోసం కదలాలి. దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషించాలి. సరైన నాయకత్వం లేక 75 ఏండ్లుగా కాంగ్రెస్, బీజేపీ నేతృత్వంలో దేశంఅన్ని రంగాల్లో వెనుకబడే ఉన్నది’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ నెల 22 నుంచి జూన్ 22 వరకు 30 రోజులపాటు రాష్ట్రంలో ప్రతి పల్లెలో పార్టీ ని ర్మాణం చేపట్టాలని మహారాష్ట్ర బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ సూచించారు. ‘పార్టీ శ్రేణులు గ్రామాలకు తరలివెళ్లాలి. ప్రతిరోజు కనీసం 5 గ్రామాల్లో ప్రచారం చేపట్టాలి. మొ త్తం 10 కమిటీలు ఏర్పాటుచేయాలి. బీఆర్ఎస్ పార్టీ కమిటీ, కిసాన్ , యూత్, మహిళ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, విద్యార్థి. కార్మిక కమిటీలు ఉండాలి. గ్రామాలు వందకు తక్కువ జనాభా ఉన్నవైతే ఆరుగురితో కమిటీ, వెయ్యి మందికంటే ఎకువ ఉంటే 11 మందితో, 5 వేలకంటే ఎకువ ఉన్నచోట కమిటీల్లో 24 మంది ఉండవచ్చు. కమిటీ సభ్యులకూ నిష్ణాతులతో క్లాసులు చెప్పిస్తాం’అని సీఎం కేసీఆర్ చెప్పారు.
మహారాష్ట్ర తర్వాత ఇతర రాష్ర్టాలపై కూడా బీఆర్ఎస్ ఫోకస్ పెడుతుందని పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. ‘మహారాష్ట్రలో మనం అనుకొన్న పని జరుగుతున్నది. హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలకు కూడా వెళ్లాల్సి ఉన్నది. అకడా పార్టీని విస్తరించాల్సి ఉన్నది’ అని తెలిపారు. కర్ణాటకలో బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ అక్కడ పెద్దగా మార్పేమీ ఉండదని అన్నారు. ‘కర్ణాటక ప్రజలకు కాంగ్రెస్ పాలన కొత్తది కాదు. కాంగ్రెస్, బీజేపీ రెండూ కేవలం రాజకీయం చేసే పార్టీలు. ఎన్నికల్లో ప్రజలు గెలువాలి. ప్రజల ఎజెండా గెలువాలని బీఆర్ఎస్ శపథం తీసుకొన్నది. ప్రజల సమస్యలన్నింటినీ తీర్చడంతోపాటు అభివృద్ధికి తారాణంగా తెలంగాణ నిలబడేలా చేశాం. ఇప్పుడు దేశంలో తెలంగాణ మాడల్ కావాలన్న డిమాండ్ మొదలైంది’అని సీఎం చెప్పారు.
దేశంలో ప్రజల అవసరానికి మించి రెండింతల నీళ్లున్నా, ఇప్పటివరకు మనం వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయామని సీఎం కేసీఆర్ అన్నారు. ‘దేశంలో మనకు లక్షా 40 వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయి. సగం నీళ్లు ఆవిరైనా 70 వేల టీఎంసీలుం టే, మనం వాడుతున్నది 20 వేల టీఎంసీలే. వృథాగా సముద్రంలో కలుస్తున్నవి 50 వేల టీఎంసీలు. అవసరమైన దగ్గర బ్యారేజీలు, రిజర్వాయర్లు కట్టి నీళ్లు మళ్లించాలి. మళ్లించకపోతే నీటి కొరత ఎదురోవాల్సి వస్తుంది. ఈ వైపరీత్యం ఇంకెన్నాళ్లు? అకోలా, ఔరంగాబాద్‌లో వారం, పది రోజులకు ఒకసారి తాగునీరు వస్తున్నది. ఈ పరిస్థితి మారాలని ఇన్నేండ్లు పాలించిన పార్టీలు ఎందుకు అనుకోలేదు? ఢిల్లీలోనూ నీళ్లకు, విద్యుత్తుకు సమస్య ఉన్నది. దేశంలో 75 ఏండ్లలో పాలకులు రైతుల గురించి పట్టించుకోలేదు. నేటికీ రైతులు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. దళితులు, ఆదివాసీలు, బీసీలు, మైనార్టీల పరిస్థితి దారుణంగానే ఉన్నది. కొన్ని చోట్ల ఉద్యమాల వల్ల, ఆలోచనాపరులు ఉండటంతో కొంత అభివృద్ధి జరిగింది. కానీ, జరగాల్సిన రీతిలో అభివృద్ధి జరగలేదు’ అని సీఎం కేసీఆర్ అన్నారు.
రైతుల తమ హక్కుల కోసం ఇంకెన్నాళ్లు పో రాటాలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. ‘దేశంలో హకుల కోసం రైతులు అనేక పోరాటాలు చేశారు. మహారాష్ట్రలో శరద్‌జోషి నేతృత్వంలో అనేక ఆందోళనలు జరిగాయి. సర్ చోటూరాం, నంజుండప్ప, మహేంద్ర టికాయత్సహా అనేక మంది రైతు ఉద్యమాలు చేశారు. ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కోసం ఇప్పుడు కూడా మహారాష్ట్రలో రైతులు పాదయాత్రలు చేస్తున్నారు. ఇదెంత దారుణం! రైతుల దుఃఖం ఇలాగే ఉంటుందా? ఇది మారాలి.. మార్పుకోసమే మనం కదలాలి. బీఆర్ఎస్ రైతుల పార్టీగా, రైతుల కోసం పనిచేసే పార్టీగా పనిచేస్తుంది. తెలంగాణాలో మేం రైతుల కష్టాలు తీర్చాం. రైతును రాజును చేశాం. తెలంగాణ మాడల్‌ను దేశవ్యాప్తంగా అమలు చేస్తాం. ఆరున్నరేండ్లలోనే అద్భుతం సాధించాం. ప్రతి రైతుకు కావాల్సినంత నాణ్యమైన విద్యుత్తు. సాగునీరు ఇచ్చినం. ఇం టింటికీ తాగునీరు అందించాం. రూపాయికే తాగునీటి నల్లా కనెక్షన్ ఇచ్చాం. ఇవన్నీ కల కాదు నిజమని నిరూపించాం. గతంలో ఉన్న అధికారులే ఇప్పుడూ ఉన్నారు. మారిందల్లా దృక్పథం. చిత్తశుద్ధితో పనిచేశాం. అందుకే ఇన్ని సాధించగలిగాం’ అని సీఎం వివరించారు.