మధిర, మార్చి 7 : నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో నిర్మించిన వంద పడకల దవాఖానను ప్రారంభించాలని, ఎమ్మెల్యే, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిర్లక్ష్యం వీడాలని కోరుతూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం వంద పడకల దవాఖాన ఎదుట ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా జడ్పీ మాజీ చైర్మన్ లింగాల్ కమల్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 15 నెలలయినప్పటికీ తన సొంత నియోజకవర్గంలో వంద పడకల దవాఖాన ప్రారంభించడానికి డిప్యూటీ సీఎంకు తీరిక దొరకడం లేదా? అని ప్రశ్నించారు. కేవలం డబ్బులు వచ్చే పనులపైనే కాకుండా ప్రజలకు ఉపయోగకరమైన పనులపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎంను కోరారు.