KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) యశోద ఆసుపత్రి నుంచి శుక్రవారం డిశ్చార్జి కానున్నారు. గత వారం రోజులుగా కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆసుపత్రి ( yashoda hospital) లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. కేసీఆర్‌కు గత వారం తుంటి ఎముక శస్త్రచికిత్స (hip bone replacement surgery) జరిగింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని పరీక్షించిన వైద్యుల బృందం.. రేపు డిశ్చార్జి చేయనున్నట్లు వెల్లడించారు. డిశ్చార్జ్ అనంతరం కేసీఆర్ బంజారాహిల్స్‌లోని నందినగర్‌లోని నివాసానికి వెళ్లనున్నారు.
కేసీఆర్ ఎర్రవల్లిలోని తన నివాసంలో గత గురువారం రాత్రి కాలు జారిపడ్డారు. దీంతో కుటుంబసభ్యులు హుటాహుటిన ఆయనను సోమాజిగూడలోని యశోద దవాఖానకు తరలించారు. వైద్యులు సీటీ స్కాన్ సహా అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. కేసీఆర్ ఎడమ కాలి తుంటి భాగంలో ఫ్రాక్చర్ అయినట్టు గుర్తించారు. శుక్రవారం శస్త్రచికిత్స నిర్వహించారు. శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవడానికి 6-8 వారాల సమయం పడుతుందని వైద్యులు ఇప్పటికే వెల్లడించారు.
Also Read..
CM Revanth Reddy | సమాజంలోని రుగ్మతలను శాసనసభ ద్వార పరిష్కరిద్దాం: సీఎం రేవంత్