KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్కు బయల్దేరారు. గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి కాసేపటి క్రితం హైదరాబాద్కు బయల్దేరారు. మధ్యాహ్నం వరకు తెలంగాణ భవన్కు చేరుకుంటారు. అక్కడ రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొననున్నారు. రాష్ట్ర కార్యవర్గం, జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత, మాజీ ఎంపీల, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జిలు సమావేశానికి హాజరుకానున్నారు.
బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు కావస్తున్న నేపథ్యంలో పార్టీ సిల్వ ర్ జూబ్లీ వేడుకల నిర్వహణతోపాటు సభ్యత్వ నమోదు, పార్టీ నిర్మాణం తదితర నిర్మాణాత్మక అంశాలపై విస్తృతస్థాయిలో చర్చించనున్నట్టు వర్కింగ్ ప్రెసిడెం ట్ కేటీఆర్ ఇప్పటికే ప్రకటించారు.
ఈ నెలాఖరులో బహిరంగ సభ నిర్వహించాలని పార్టీ నాయకత్వం మొదట నిర్ణయించింది. అయితే, బహిరంగసభను ఈ నెలలో నిర్వహించడం కన్నా పార్టీ ఆవిర్భావ దినోత్సవంనాడు నిర్వహించాలా? లేదా పార్టీ అధ్య క్ష ఎన్నిక ఉన్న సెప్టెంబర్/అక్టోబర్లో నిర్వహించా లా? అనే అంశంపై చర్చించనున్నట్టు సమాచారం. ఏప్రిల్ 27న ప్రతినిధుల సభను నిర్వహించి, అప్పటినుంచి అధ్యక్ష ఎన్నిక నాటికి పార్టీ సభ్యత్వ నమో దు, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి దాకా పార్టీ ప్రధాన కమిటీలు, అనుబంధ కమిటీల ఎన్నికల ని ర్వహణ, సెప్టెంబర్ లేదా అక్టోబర్లో అధ్యక్ష ఎన్నిక నిర్వహణ తదితర అంశాలపై లోతుగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ చేపట్టాల్సిన కార్యాచరణ, అనుసరించే వ్యూహంపై పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.