KCR | హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ నివాసంలో సిట్ విచారణ ప్రారంభమైంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ జరిపేందుకు కొద్దిసేపటి కిందట సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయణ రెడ్డి, శ్రీధర్, కేఎస్ రావు పలు డాక్యుమెంట్లు, పరికరాలతో కేసీఆర్ నివాసానికి వచ్చారు. కేసీఆర్ ఇంట్లోని రెండో ఫ్లోర్‌లోని గదిలో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. విచారణ సమయంలో కేసీఆర్‌తో ఒకరు మాత్రమే ఉండేందుకు సిట్ అధికారులు అనుమతినిచ్చారు. దీంతో న్యాయ సలహాల కోసం అడ్వకేట్ రాంచందర్‌రావును కేసీఆర్పాటు పాటు దర్యాప్తులో ఉండేందుకు వెసులుబాటు కల్పించారు.
కాగా, ఎర్రవెల్లి నివాసంలో ఉన్న కేసీఆర్ సిట్ విచారణ కోసం ఇవాళ ఉదయం బయల్దేరి హైదరాబాద్‌కు వచ్చారు. ఎర్రవెల్లి నివాసం నుంచి బయల్దేరిన కేసీఆర్ కాన్వాయ్‌కు దారిపొడవునా జనాలు నీరాజనం పలికారు. అభిమానులు, ప్రజలు రోడ్డు పక్కన నిలబడి అభివాదం చేస్తూ సంఘీభావం తెలిపారు. కాన్వాయ్‌పై పూలు జల్లి తమ అభిమానం చాటుకున్నారు. నందినగర్ నివాసంలోకి పార్టీ నేతలు, ఇతర సిబ్బందికి అనుమతి నిరాకరించారు. కేసీఆర్ కుటుంబసభ్యులు హరీశ్‌రావు, కేటీఆర్, సంతోష్‌లకు మాత్రమే అనుమతినిచ్చారు.
కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు విజయ్ కుమార్, వెంకటగిరి, నారాయణ రెడ్డి, శ్రీధర్, కేఎస్ రావు.
మరికాసేపట్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను విచారించనున్న సిట్ అధికారులు https://t.co/QM7s3oRgmv pic.twitter.com/j7w1tOCrlH
— Telugu Scribe (@TeluguScribe) February 1, 2026