ఇచ్చోడ, ఏప్రిల్ 19 : జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు ముక్రా(కే) గ్రామస్తులు రూ.21 వేల విరాళాన్ని ప్రకటించారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామానికి చెందిన రైతులు, స్థానికులు ఈ మొత్తాన్ని సమీకరించి మాజీ సర్పంచ్ మీనాక్షికి అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో ముక్రా(కే) గ్రామం దేశంలోనే ఆదర్శంగా నిలిచిందని గుర్తుచేశారు. సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికీ లాభం చేకూరిందని వివరించారు. ఈ విరాళాన్ని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అందజేయాలని నిర్ణయించారు.