KCR | బీఆర్ఎస్ సీనియర్ నాయకులతో పార్టీ అధినేత కేసీఆర్ సమావేశమయ్యారు. ఎర్రవల్లి నివాసంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ అలీ, పద్మారావు గౌడ్, సబితా రెడ్డితో భేటీ అయ్యారు.
ఇదిలా ఉండగా.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్‌ను కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో, త్వరలో జరుగనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో.. పార్టీలో సీనియర్ నేతగా, జూబ్లీ హిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్ధిగా ఎంపిక చేశారు.
చిత్తశుద్ధి కలిగిన నిస్వార్థ నేతగా, వారి నిబద్ధతను పరిశీలించిన మీదట, మాగంటి గోపీనాథ్ పార్టీకి, ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు, గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపీనాథ్ కుటుంబానికే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS, పార్టీ సీనియర్ నేతలు మాజీ మంత్రులు, @BRSHarish, @mahmoodalibrs, @TPadmaRao, @BrsSabithaIndra లతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ https://t.co/fULw77XwVF pic.twitter.com/qWluR5QO6C
— BRS Party (@BRSparty) September 26, 2025