మహబూబాబాద్, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ పాగా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 స్థానాలు సమానంగా వచ్చాయి. కేసముద్రం మున్సిపాలిటీపై వేం నరేందర్రెడ్డి ప్రత్యేకంగా దృష్టి సారించినా ఆశించిన ఫలితాలు రాకపోవడంతో కాంగ్రెస్ నాయకులు నిరాశలో ఉన్నారు.
వేం నరేందర్రెడ్డి ఇలాకాలో గతేడాది డిసెంబర్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ సమానంగా సీట్లు సాధించాయి. మొత్తం 29 జీపీలు ఉండగా, మూడు ఏకగ్రీవమయ్యా యి. మిగతా 26 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 13 పంచాయతీలను గెలుచుకున్నా యి. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల్లో నూ అదే పరిస్థితి రావడంతో కాంగ్రెస్ భవితవ్యమేంటని స్థానిక కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.