Jubilee Hills By Poll | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని కృష్ణా నగర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కృష్ణానగర్, శ్రీనగర్ పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లో ఇతర ప్రాంతాల నుంచి మహిళలను తీసుకొచ్చి కాంగ్రెస్ నేతలు దొంగ ఓట్లు వేయిస్తున్నారు. ఈ క్రమంలో ఫేక్ ఓట్లు, రిగ్గింగ్ చేస్తున్నారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కృష్ణానగర్లో నిరసనకు దిగారు.
కాంగ్రెస్ నేతలు నిబంధనలు ఉల్లంఘించి దొంగ ఓట్లు వేయిస్తున్నారని సునీత మండిపడ్డారు. దొంగ ఓటర్లకు పోలీసులు సహకరిస్తున్నారు. తాము దొంగ ఓటర్లను రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని పోలీసులకు, ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. చనిపోయిన వృద్ధురాలి పేరుతో కూడా ఓటేశారు. ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు అని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడుతుంది, మా పార్టీ కార్యకర్తలను కొట్టి, తిరిగ వారి మీదనే కేసులు పెడతామని నవీన్ యాదవ్ అనుచరులు బెదిరిస్తున్నారు అని మాగంటి సునీత పేర్కొన్నారు.
ఫేక్ ఓట్లు, రిగ్గింగ్ చేస్తున్నారని నిరసనకు దిగిన మాగంటి సునీత
కాంగ్రెస్ పార్టీ రౌడీ షీటర్లతో దౌర్జన్యాలకు పాల్పడుతుంది, మా పార్టీ కార్యకర్తలను కొట్టి, తిరిగ వారి మీదనే కేసులు పెడతామని నవీన్ యాదవ్ అనుచరులు బెదిరిస్తున్నారు –మాగంటి సునీత pic.twitter.com/ZwXjxQkvTX
— Telugu Scribe (@TeluguScribe) November 11, 2025