కార్పొరేషన్, ఆగస్టు 12 : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 14న కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తలపెట్టిన బీసీ కదనభేరి సభను వాయిదా వేసినట్టు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి 17 వరకు అతి భారీ వర్షాలు పడే అవకాశమున్నదని వాతావరణశాఖ సూచనలు, ప్రభుత్వ ముందస్తు హెచ్చరికల నేపథ్యంలో ఈ సభను వాయిదా వేస్తున్నామని వివరించారు. వాతావరణం అనుకూలించిన అనంతరం సభను నిర్వహిస్తామని పేర్కొన్నారు.