ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 21 : సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక.. రైతు రుణమాఫీ కాక ఆందోళనకు గురై ఇటీవల పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల కేంద్రానికి చెందిన రైతు పిట్టల లింగన్న కుటుంబానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. సోమవారం పార్టీ తరఫున రూ.లక్ష చెక్కును కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల అందజేశారు. బీఆర్ఎస్ రైతు ఆత్మహత్యల అధ్యయన కమిటీ సభ్యులు కొన్ని రోజుల కిందట పరామర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో లింగన్న భార్య పిట్ల లక్ష్మికి బీఆర్ఎస్ తరఫున చెక్కును అందజేసి కుటుంబ సభ్యులకు భరోసా కల్పించారు. లింగన్న కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని తెలిపారు.