మహబూబ్‌నగర్, జూన్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్ (నమస్తే తెలంగాణ) : కృష్ణా నదిలో మన వాటాను వినియోగించుకోకుండా నీటిని ఏపీకి ధారాదత్తం చేయడం, తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయకుండా సొంత జిల్లా పాలమూరును పడావు పెట్టిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో వాటి నుంచి ప్రజల దృష్టిమళ్లించేందుకు సీఎం మళ్లీ బీఆర్ఎస్పై విమర్శలు చేస్తూ శివాలూగారు. రెండున్నరేండ్ల నుంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పండబెట్టి తట్టె డు మట్టి ఎత్తని సీఎం రేవంత్ శుక్రవారం ఆదరాబాదరగా పాలమూరులో పర్యటించారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం ఉద్దండాపూర్‌లో నిర్వహించిన ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ బహిరంగ సభలో ఎప్పటిలానే కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కారు. కర్ణాటకలో సీఎం పదవి మార్పిడి జరిగినట్టే తెలంగాణలోనూ సీఎంను మారుస్తారని ఊహాగానా లు.. ఢిల్లీకి వెళ్లి మంత్రులు అధిష్ఠానాన్ని కలిసి రావడంతో ఫ్రస్ట్రేషన్‌కు గురైన రేవంత్ మరోసారి బీఆర్ఎస్ అధినేతపై తన అక్కసు వెళ్లగక్కారు. ముఖ్య మంత్రై 30 నెలల్లో సొంత జిల్లా పాలమూరుకు ఏం చేశాడో చెప్పకుండా విమర్శలు, సవాళ్లతో సరిపెట్టా రు. రెండు రోజులు కాలికి బలపం కట్టుకొని హెలి కాప్టర్లలో చక్కర్లు కొట్టినా ఇక్కడ ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో నిరాశకు గురైన రేవంత్ మళ్లీ పాత పాట పాడారు.
‘పాలమూరు ప్రజలకు మట్టి తీసుడే కాదు.. మట్టితో కప్పడం కూడా తెలు సు.. పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ను బొంద పెడుతా.. ఏ ఒక్కరినీ ఎమ్మెల్యేగా గెలువనియ్య.. బీఆర్ఎస్ దిమ్మెలు కూ లాలి. గద్దెలు దిగాలి.. వచ్చే ఎన్నికల్లో పాలమూరులో బీఆర్ఎస్కు డిపాజిట్ వస్తే.. నా పేరు మార్చుకుం టా’ అని సవాల్ చేశారు. ‘మీ పదేండ్ల పాలన, మా రెండున్నరేండ్ల పాలనపై చర్చిద్దాం.. కేసీఆర్ అసెంబ్లీకి రావాలె.. నాది తప్పయితే క్షమాపణ చెప్తా’నంటూ రెచ్చిపోయారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా రాజకీయంగా వలస వచ్చిన కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పదేండ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని అబద్ధాలు వల్లె వేశారు. ‘2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్‌దే అధికారం.. కేసీఆర్‌కు ఇదే నా సవాల్’ అంటూ ఊగిపోయారు. కేటీఆర్ పాలమూరు నుంచే తన పాదయాత్ర మొదలు పెడుతారన్న అంశంపై పదేపదే తన అసంతృప్తి వెళ్లగక్కారు.
కృష్ణా నదీ జలాల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చర్చల ద్వారా ఒప్పిస్తానని, చర్చల ద్వా రానే 60 ఏండ్ల నాటి రావణకాష్టానికి ముగింపు పలుకుతానని సీఎం రేవంత్ ప్రకటించారు. ‘పక్క రాష్ట్రంతో నేను చర్చలు చేస్తా అంటే.. నా మీద బురద జల్లాలనే ప్రయత్నం చేస్తుండు. నువ్ బురద జల్లినా, కాళ్లు తలకిందులుగా పెట్టి పెట్టినా.. సీసాలో తలకాయ పెట్టి సచ్చినా.. పక్క రాష్ట్రంతో చర్చలు జరిపి తీరుతా’నంటూ కేసీఆర్‌పై అవాకులుచెవాకులు పేలారు. ‘పదేండ్లలో కాళేశ్వరం కోసం లక్ష కోట్లు ఖ ర్చు చేసిన కేసీఆర్.. ఉద్దండాపూర్ మునిగితే రూ.800 కోట్లు ఇవ్వలేదు.. నిర్వాసితులను జైల్లో పెట్టి కొట్టించారు.. మన భూములకు సాగునీళ్లు రాలేదు.. మన కష్టాలు తీరలేదు.. మీ పాలమూరు బిడ్డగా జిల్లాలో ప్రాజెక్టుల కోసం 30 నెలల్లో రూ.8 వేల కోట్లు ఖర్చు చేశా’నంటూ నిస్సిగ్గుగా అబద్ధాలు వల్లించారు.