Vemula Prashanth Reddy | నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పోలీసుల దమనకాండ కొనసాగుతోంది. ప్రజాస్వామ్యబద్దంగా మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తలపెట్టిన నిరాహార దీక్షను భగ్నం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు దిగుతోంది.
ఉదయం నుంచి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎక్కడికక్కడ గృహనిర్బంధాలతో పాటు అరెస్టు చేసి పలు పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డిని వేల్పూర్‌లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
భీంగల్ మున్సిపాలిటీ అభివృద్ధితో పాటు 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, ఆర్టీసీ డిపో పునరుద్ధరణపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా నిరాహార దీక్ష చేయాలని ప్రశాంత్ రెడ్డి నిర్ణయించారు. శాంతియుతంగా నిరసన చేయాలని తలపెట్టగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉదయం నుంచి నిర్బంధాలతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఇబ్బందులకు గురిచేస్తుంది.