సిద్దిపేట : అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులకు ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ప్రతినిధులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. తాజాగా సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో కల్యాణ లక్ష్మి(Kalyana Lakshmi), షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు(Konda Surekha) నిరసన సెగ తగిలింది.
చెక్కుల పంపిణీ చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు(BRS activists) తులం బంగారం ఎప్పుడిస్తరు అనే ప్లకార్డులు ప్రదర్శించడంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇరువర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. బీఆర్ఎస్ కార్యకర్తల ప్లకార్డులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ కార్యకర్తలు కుర్చీలు ప్రదర్శించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాల నాయకులను చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఇరువర్గాలకు మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు నిరసన సెగ..
సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణ కేంద్రంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖకు నిరసన సెగ.
చెక్కుల పంపిణీ చేస్తున్న సమయంలో బీఆర్ఎస్ నాయకులు తులం బంగారం ఎప్పుడిస్తరు… pic.twitter.com/5SnpARD8Zt
— Telugu Scribe (@TeluguScribe) September 27, 2024