మహబూబాబాద్ : ఖమ్మంలో బుధవారం నిర్వహించే బీఆర్ఎస్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరుతూ మంగళవారం మహబూబాబాద్‌లో వెయ్యి బైక్‌లతో ర్యాలీ నిర్వహించారు.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ ర్యాలీలో మంత్రితోపాటు ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.