మూసాపేట, అక్టోబర్ 13 : నీటి గుంతలో(Water hole) పడి ఇద్దరు అన్నదమ్ములు(Brothers died )మృతి చెందిన ఘటన మహబూబ్‌నగర్ జిల్లా(Mahabubnagar) మూసాపేట మండలం స్ఫూర్తితండాలో చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్ఫూర్తితండాకు చెందిన సక్రూనాయక్, జ్యోతికి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. శనివారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్దకు సక్రూనాయక్, జ్యోతి కుమారులు సాయినాయక్(13), సాకేత్నాయక్(9) వెళ్లారు.
ఎంతకూ తిరిగి రాకపోవడంతో సక్రూనాయక్ పొలం వద్ద వెతికాడు. కనిపించకపోవడంతో తిరుగు పయన మయ్యాడు. మార్గమధ్యంలో ఉన్న పాంఫండ్ గుంతలో అనుమానం వచ్చి చూడగా కుమారులు ఇద్దరూ మునిగిపోయి కనిపించారు. వారిని కారులో జిల్లా దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఆదివారం కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Warangal | ఆగిన గుండె.. సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన కానిస్టేబుల్ : వీడియో
Madusudhana Chary | శాసనమండలి ప్రతిపక్ష నేతగా మధుసూదనాచారి బాధ్యతల స్వీకరణ
Manne Krishank | మెయిన్‌హార్ట్ లీగల్ నోటీసులకు భయపడం.. తేల్చిచెప్పిన మన్నె క్రిశాంక్