హైదరాబాద్, జూలై20 (నమస్తే తెలంగాణ): సాధారణ బదిలీలపై ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జీవో 80 నుంచి ఇరిగేషన్‌శాఖకు మినహాయిస్తూ సాగునీటిపారుదలశాఖ కార్యదర్శి రాహుల్‌బొజ్జా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఒకే స్టేషన్లో నాలుగేండ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న అన్ని ప్రభుత్వశాఖల్లోని అధికారులను ఈ నెల 20లోగా బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం జీవో 80ను జారీ చేసిన విషయం తెలిసిందే. తగినంత మంది ఇంజినీర్లు అందుబాటులో లేకపోవడం, వర్షాకాలం సీజన్ నేపథ్యంలో ఇరిగేషన్‌శాఖలో అన్ని క్యాడర్లకు సంబంధించి బదిలీలను జీవో 80 నుంచి మినహాయిస్తున్నట్టు వెల్లడించింది.