Medak | మెదక్ : మెదక్ జిల్లా చేగుంట మండలం ఇబ్రహీంపూర్లో విషాదం నెలకొంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఓ బాలుడిని వరికోత యంత్రం ఢీకొట్టింది. దీంతో నాలుగేండ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇబ్రహీంపూర్లో విషాదఛాయలు అలుముకున్నాయి.