మహబూబ్‌నగర్ అర్బన్, ఫిబ్రవరి 7 : మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేస్తున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండి ఆ రెండు పార్టీలను సాగనంపాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పిలుపునిచ్చారు. శనివారం మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో స్థానిక పార్టీ నాయకులతో కలిసి ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
మహబూబ్‌నగర్‌లో నిలిచిపోయిన అభివృద్ధితోపాటు కాలనీల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ ప్ర భుత్వంలో పేదలు, అంధులకు ఇండ్లు కట్టిస్తే, కాంగ్రెస్ నాయకులు వాటిని కూలగొట్టి సంబురాలు చేసుకున్నారని ధ్వజమెత్తారు. నాడు పాలమూరును అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని గుర్తుచేశారు.