మోతె, జూలై 7 : కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేదంటే రైతులు సాగు చేయలేక చేతులెత్తేసి పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గ పరిధిలోని మోతె మండలం రాఘవాపురం ఎక్స్ రోడ్డు వద్ద పంట కాలువలను సందర్శించారు.
సాగునీరు లేక రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకొని, ఎస్సారెస్పీ కాలువ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బొల్లం మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ కృషి ఫలితంగానే ఎస్సారెస్పీ కాలువల్లో నీరు పారిందని తెలిపారు. ఈ సారి సరైన వానలు లేక సాగు పనులు చేపట్టలేక రైతులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు.