హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ) : ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో సాంకేతిక కమిటీ ప్రభుత్వానికి కీలక సూచన చేసింది. ఎస్ఎల్బీసీ టన్నెల్లో టీబీఎం పద్ధతిలో తవ్వకాలు అసాధ్యమని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ పద్ధతి (డీబీఎం)లోనే సాధ్యమని ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఇన్లెట్ వైపు నుంచి టీబీఎం పద్ధతిలో తవ్వకాలు ఆపివేయాలని, డీబీఎంలోనే తవ్వకాలు జరపాలని సూచించింది. డీబీఎం పద్ధతికి అయ్యే ఖర్చును అంచనా వేయాలని, మిగతా పనులను ఎప్పటిలోగా పూర్తి చేస్తారో నిర్మాణ సంస్థ నుంచి ప్రణాళిక తీసుకోవాలని కమిటీ సిఫారసు చేసింది.
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసొసియేషన్ నూతన కార్యవర్గాన్ని బుధవారం హైదరాబాద్‌లో ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడిగా బత్తుల రాజేంద్రప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా అట్ల శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్ గౌతమి, జీ శశికళ, రమేశ్, జీ సునీల్‌కుమార్, సంయు క్త కార్యదర్శులుగా ఆర్ మహేశ్, కే సంజీవులు, కే రామకృష్ణ, చంద్రమెహన్, కోశాధికారిగా జీ మహేందర్, మీడియా కన్వీనర్లుగా జీ నరేశ్, బీ రాకేశ్‌ను ఎన్నుకున్నారు.