హైదరాబాద్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ): రాష్ట్ర బీజేపీలో ఆ పార్టీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతో ష్ వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన బీఎల్ సంతోష్.. పాత, కొత్త నేతలను ఉద్దేశించి చేసిన వ్యా ఖ్యలు కలకలం సృష్టించాయి. పాత నేతల ను ఆర్గానిక్, కొత్త నేతలను ఇనార్గానిక్ అంటూ పోల్చడంపై సొంత పార్టీ నేతలే భ గ్గుమంటున్నారు. పార్టీలో అంతర్గత వివాదాలను సద్దుమణిగేలా చేయాల్సిందిపో యి.. ఏకంగా కొత్త, పాత అంటూ విభజన రేఖ తీసుకురావడం ఏమిటని మండిపడుతున్నారు.
ఈ విషయమై కొందరు బీజేపీ నే తలు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు తెలిసింది. జాతీయ నాయకులు రాష్ర్టానికి వచ్చి పార్టీ నేతల మధ్య చిచ్చు రా జేయడమేమిటని సీరియస్ అవుతున్నారు. రాష్ట్రంలో ఒకవైపు స్థానిక ఎన్నికల హడావు డి ఉండగా, బీఎల్ వ్యాఖ్యలు కొత్త, పాత నేతల మధ్య అగాధాన్ని మరింత పెంచేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు ఆధ్వర్యంలో స్థానిక సం స్థల ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించగా.. ముఖ్యనేతలు డుమ్మా కొట్టారు. ఈ అంశంపై బీఎల్ స్పందిస్తూ.. ‘పార్టీ అ ధ్యక్షుడిగా ఎవరు ఉన్నా.. బాస్ ఈజ్ బాస్. మీటింగ్ పెడితే లైట్ తీసుకుంటారా? ఇదేం పద్ధతి?’ అని పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో రామచందర్రావును సొంత పార్టీ నేతలే లైట్ తీసుకుంటున్నారనే విషయాన్ని బీఎల్ సంతోష్ చెప్పకనే చెప్పారు.