టీఆర్ఎస్వీ నాయకుడికి గాయాలు
నర్మెట, ఫిబ్రవరి 10: జనగామ జిల్లా నర్మెట చౌరస్తాలో గురువారం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న టీఆర్ఎస్ నాయకులను రెచ్చగొట్టేలా బీజేపీ శ్రేణులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించారు. దీంతో ఇరువర్గాల నినాదాలతో ఆ ప్రాంతం ఉద్రిక్తంగా మారింది. బీజేపీ శ్రేణులు కర్రలతో టీఆర్ఎస్ నాయకులపై విచక్షణారహితంగా దాడిచేయడంతో పలువురికి గాయాలయ్యాయి. టీఆర్ఎస్వీ మండల మాజీ అధ్యక్షుడు గడపురం శశిరత్ను బీజేపీ మండల అధ్యక్షుడు రాజు కర్రతో కొట్టడంతో తలకు తీవ్ర గాయమైంది. నర్మెట ఎంపీపీ తేజావత్ గోవర్ధన్‌ను కూడా రాజు కాలితో తన్నడంతో ఇరువర్గాలు దాడి చేసుకొన్నాయి. దాడికి కారణమైన బీజేపీ శ్రేణులపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.