హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హిల్ట్ పాలసీపై ప్రభుత్వం దిగి వచ్చేలా ఈ నెల 7న ప్రజా వంచన పేరుతో ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా చేపడుతామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు వెల్లడించారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకు ధర్నా కొనసాగుతుందని పేర్కొన్నారు. మహాధర్నాకు ప్రజలు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఈ మహాధర్నా చేపడుతున్నట్టు ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని హామీలను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ప్రజలకు వివరిస్తామని చెప్పారు.