హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ నేతను జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills by-election) బీజేపీ అభ్యర్థిగా ప్రకటించాలని ఆపార్టీ ఎంపీ ప్రతిపాదించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. గురువారం హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ సమావేశంలో మాజీ మేయర్, కాంగ్రెస్ నాయకుడు బొంతు రామ్మోహన్‌ను బరిలోకి దించాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావును కోరారు.
ఆయన నిరుడు ఏబీవీపీలో చురుగ్గా పనిచేశారని, ఈ నేపథ్యంలో పార్టీలో చేర్చుకుని టికెట్ ఇవ్వాలని సూచించారు. కాగా, ఈ వ్యవహారంపై బొంతు రాంమోహన్ స్పందించారు. కాంగ్రెస్‌లో ప్రస్తుతం చాలా కంఫర్ట్‌గా ఉన్నానని తెలిపారు. బీజేపీలో జరిగిన అంతర్గత చర్చకు తనకు ఎంతమాత్రం సంబంధం లేదని ఒక ప్రకటనలో స్పష్టంచేశారు.