టీఆర్ఎస్ శ్రేణులపై బీజేపీ గూండాల దాడి
మంచిర్యాలలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ విధించడంపై నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో రాస్తారోకో
- ఎమ్మెల్యే దివాకర్రావుపైకి కర్రలు
- ఐదుగురు కార్యకర్తలకు గాయాలు
- గులాబీ నేతల రాస్తారోకోకు అడ్డు
- మంచిర్యాల జిల్లాలో ఘటన
మంచిర్యాల, జూలై 20, నమస్తే తెలంగాణ/మంచిర్యాల టౌన్ : మంచిర్యాలలో బీజేపీ నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీఆర్ఎస్ నాయకులపై దాడికి తెగబడ్డారు. పాలు, పాల ఉత్పత్తులపై కేంద్రప్రభుత్వం జీఎస్టీ విధించడంపై నిరసిస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ క్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా రాస్తారోకో మీదికి దూసుకురాగా, టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకొన్నాయి. మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్‌రావు లక్ష్యంగా బీజేపీ గూండాలు ఆయనపైకి కర్రలు, జెండాలు విసిరారు.
ఈ ఘటనలో టీఆర్ఎస్ కార్యకర్తలు బింగి ప్రవీణ్, నాగులపల్లి సాగర్, షేక్ ఇమ్రాన్, గాండ్ల సంజయ్, సుంకరి రమేశ్ గాయపడ్డారు. వీరు ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఇరువర్గాలను శాంతింపజేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బీజేపీ నాయకుల గూండాయిజాన్ని సహించబోమని, తాము శాంతియుతంగా రాస్తారోకో చేస్తుంటే తమ పైకి దూసుకురావడం దారుణమని టీఆర్ఎస్ యూత్ నాయకుడు, ఎమ్మెల్యే తనయుడు నడిపెల్లి విజిత్‌రావు మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- Attack
- BJP
- Manchiryal
- thugs
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

