BJP | బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ భేటీ.. పార్లమెంటు అభ్యర్థులు వీరే!
పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది.
హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికలకు రాష్ట్ర బీజేపీ (BJP) సమాయత్తమవుతున్నది. అందరి కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని నిర్ణయించిన పార్టీ అధిష్టానం ఆ దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర ఎన్నికల కమిటీ ఢిల్లీలో భేటీ అయింది. పార్లమెంటు అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నది. ఈ నెల 16లోపే ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉన్నది. రాష్ట్రంలోని 17 స్థానాల్లో మెజార్టీ సీట్లకు అభ్యర్థుల పేర్లు మొదటి జాబితాలోనే ఉండే అవకాశం ఉన్నది.
సికింద్రాబాద్ స్థానానికి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుంచి బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి, భువనగిరి స్థానానికి బూర నర్సయ్య గౌడ్, మహబూబ్‌నగర్ నుంచి డీకే అరుణ అభ్యర్థిత్వాలపై అభిప్రాయాలను సేకరిస్తున్నది. అదేవిధంగా పెద్దపల్లి, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, వరంగల్, జహీరాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, నల్లగొండ స్థానాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చినవారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. ఇక మల్కాజిగిరి, మెదక్, హైదరాబాద్ స్థానాల్లో అభ్యర్థుల విషయమై కేంద్ర ఎన్నికల కమిటీకే నిర్ణయాన్ని వదిలేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zayn Marie | ఆమిర్ ఖాన్ మేనకోడలికి గాయాలు.. పోలీసుల చర్యలపై జైన్ మేరీ ఆగ్రహం
Bala Krishna | ట్రాఫిక్ సమస్యకు బాలకృష్ణ సహకారం.. ఎన్టీఆర్ జ్ఞాపకాలతో ముడిపడిన ఇంటి స్థలాన్ని వదులుకోనున్నారా..!
Jailer 2 | ‘జైలర్ 2’లో యంగ్ రజనీకాంత్ స్పెషల్ ఫ్లాష్‌బ్యాక్.. శివరాజ్‌కుమార్‌తో కలిసి జైలు సీక్వెన్స్ ఉంటుందా?
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో డబుల్ ఎలిమినేషన్.. షాలినిని టార్గెట్ చేసిన ఐదుగురు వైల్డ్‌కార్డులు!
Nepal Floods | నేపాల్‌లో మళ్లీ వరదల బీభత్సం.. కొట్టుకుపోయిన పలు ఇండ్లు, వంతెనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

